పులి సంచారం.. మళ్లీ అదే రిపీట్ అవుతుందా?

పులి సంచారం.. మళ్లీ అదే రిపీట్ అవుతుందా?

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. 2022లో ఏలేశ్వరం, రౌతులపూడి పరిసరాల్లో నెలల తరబడి తిరిగిన పులి, అధికారులకు చిక్కకుండానే మాయమైన సంగతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రత్తిపాడులోనే పులి మకాం వేయడంతో, ఈసారి కూడా అది అప్పటిలాగే పట్టుబడకుండా తప్పించుకుంటుందా అని జనం టెన్షన్ పడుతున్నారు.