పాలిసెట్‌పై విద్యార్థులకు అవగాహన
నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ మండలం తొండకూర్ ZPHS విద్యార్థులకు గురువారం టీజీ పాలిసెట్-2026పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. పరీక్షా తేదీలు, అర్హతలు, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ, సిలబస్, ర్యాంకులు, కటాఫ్‌పై వివరించారు.