VIDEO: కాంగ్రెస్ మెజారిటీపై మంత్రి పొన్నం హర్షం

VIDEO: కాంగ్రెస్ మెజారిటీపై మంత్రి పొన్నం హర్షం

SDPT: రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుండటంతో మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పట్ల విశ్వాసం ఉంచారని ఆయన పేర్కొన్నారు.