రెండవ విడత పోలింగ్ ప్రశాంతం: కలెక్టర్
BHNG: జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఆదివారం అయన జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించారు. ఓటు హక్కు వినియోగించుకున్న 102 సంవత్సరాల మణెమ్మ అనే వృద్ధురాలికి పూల మొక్కతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వాగతం పలికారు.