ఉండవెల్లిలో అక్రమ ఇసుక లారీ పట్టివేత

GDWL: ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణలోని పెబ్బేరుకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక లారీని ఉండవెల్లి పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. టోల్ గేట్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ లారీని పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. లారీ డ్రైవర్ అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.