త్వరలో ఫుట్ పాత్ అక్రమణాల తొలగింపు..!

MDCL: రామంతాపూర్ మెయిన్ రోడ్డు పెద్ద చెరువు నుంచి టీవీ స్టూడియో వరకు ఉన్న ఫుట్ పాత్ ఆక్రమణ జరిగి ఏళ్లు గడుస్తున్నాయని, ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని వచ్చిన ఫిర్యాదులపై ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. త్వరలోనే ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయానికి కారణమయ్యే ప్రతి దానిపై చర్యలు ఉంటాయన్నారు.