అమరవీరులకు నివాళులర్పించిన సీపీఎం నాయకులు

SDPT: దుల్మిట్ట మండలం కూటిగల్ గ్రామంలో అమరవీరుల స్థూపం, తూటాల మర్రి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ.. 1948లో రజాకార్లు గ్రామంపై దాడి చేసి 18 మందిని హతమార్చిన ఘటన సాయుధ పోరాటానికి నాంది అయిందని పేర్కొన్నారు.