సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే
SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ సీఎం చంద్రబాబును శనివారం సాయంత్రం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పలు సమస్యలను తెలియజేశారు. వీటికి సీఎం సానుకూలంగా స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.