ఇల్లందలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం ఫైర్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ చర్యలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. గ్యాస్ సిలిండర్లు, పైపులను తరచూ తనిఖీ చేయాలని, వంటగదిలో సరైన గాలి ప్రసరణ ఉండాలని అధికారులు సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో ఆస్తి, ప్రాణ నష్టం నివారించవచ్చని తెలిపారు.