ఇద్దరు పైలట్లు మృతి: వాయుసేన
అసోంలో సుఖోయ్-30 MKI యుద్ధ విమానం కూలినట్లు భారతీయ వాయుసేన వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానాన్ని నడపుతున్న ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు చెప్పింది. మరణించిన వారిని స్క్వాడ్రన్ లీడర్ అనూజు, ఫైట్ లెఫ్టినెంట్ పుర్వేశ్‌గా గుర్తించారు. వీరిద్దరూ ఎజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణకు వాయుసేన ఆదేశించింది.