రాజకీయ పార్టీ నాయకులతో RDO సమావేశం

రాజకీయ పార్టీ నాయకులతో RDO సమావేశం

ప్రకాశం: కనిగిరి ఆర్డీవో శివరామిరెడ్డి గురువారం నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. 2002 ఓటర్ల జాబితాను 2025 జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఓటర్ల జాబితా సవరణలపై సూచనలు ఇచ్చారు. మరణించిన వారి పేర్లు తొలగించాలన్నారు.