సాక్షిపై ఎంపీ పరువు నష్టం దావా..!

సాక్షిపై ఎంపీ పరువు నష్టం దావా..!

NTR: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సాక్షి పత్రిక, యాజమాన్యంపై పరువు నష్టం దావా కేసు పెట్టినట్లు తెలిపారు. తనపై తప్పుడు వార్తలు ప్రచురించినందుకు ఈ కేసు పెట్టానని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీనిపై సాక్షి పత్రిక, యాజమాన్యం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.