పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ పై సమావేశం

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ పై సమావేశం

BDK: దమ్మపేట మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో స్థానిక పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. స్వల్ప మార్పులు మినహా రిజర్వేషన్లు దాదాపు యథాతథంగానే కొనసాగుతాయని ఎంపీడీఓ రవీంద్ర రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ సహా ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.