'ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం'

కృష్ణా: కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి వారి పక్షాన పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పెదపారుపూడి మండలం నాగపురంలో వైసీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు.