'నీటి సరఫరా నిలిపివేత'

MDK: నర్సాపూర్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ కారణంగా పలు గ్రామాలకు నీటి సరఫరా నిలిపివేసినట్లు బీఆర్సీ అధికారులు తెలిపారు. లీకేజీతో నర్సాపూర్, కొల్చారం, కౌడిపల్లి మండలాల్లో నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మరమ్మతులు పూర్తి కాగానే నీటిని సరిఫరా చేస్తామని చెప్పారు.