VIDEO: మత్తడి వాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటి విడుదల

ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటి విడుదల చేసినట్లు మంగళవారం ప్రాజెక్టు అధికారి హరీష్ తెలిపారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టు లోకి వరద నీరు వచ్చి చేరుతుందని తెలిపారు. ఈ కారణంగా 5436 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3032 క్యూసెక్కులు ఉందని వెల్లడించారు.