'సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి'
KNR: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైదాపూర్ కొత్త బస్టాండ్ వద్ద ప్రజలకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు, APK ఫైల్స్ లింక్స్ పంపిస్తే ఓపెన్ చేయొద్దన్నారు. అలా చేస్తే వ్యక్తిగత సమాచారం వాళ్ల చేతుల్లోకి వెళ్తుందన్నారు. అలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.