ముగిసిన సలేశ్వరం జాతర.. అధికారుల ప్రకటన
NGKL: లింగాల మండలంలోని నల్లమల అడవుల్లోని సలేశ్వరం లింగమయ్య జాతర శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. అటవీ శాఖ అనుమతి గడువు ముగియడంతో భక్తులు పరిస్థితిని గమనించి అధికారులకు సహకరించాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది. అటవీ మార్గంలో ప్రయాణించేటప్పుడు క్రమశిక్షణతో ఉంటూ, సురక్షితంగా తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు.