నేటి నుంచి ఇస్కాలలో దేవతల పునఃప్రతిష్ఠ ఉత్సవాలు
NDL: పాములపాడు మండలం ఇస్కాల గ్రామంలో శ్రీ జమ్ములమ్మ, శ్రీ సుంకులమ్మ, శ్రీ మారెమ్మ గ్రామ దేవతల పునఃప్రతిష్ఠ మహోత్సవాలు నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ నెల 29న గణపతి పూజ, అంకురార్పణ, 30న విగ్రహాభిషేకాలు, 31న చండీయాగం జరుగుతాయి. వచ్చే నెల 1న ప్రతిష్ఠాంగ హోమాలు, 2న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.