జాతీయ రహదారి రోడ్డు ప్రమాదం
JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో టాటా ఏసీ వాహనం బైక్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాలానా జీపేట గ్రామానికి చెందిన ఉప్పల ఎల్లయ్య (60), బాబు (50)లకు తీవ్ర గాయాలయ్యాయి.