ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్
కర్నూలు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఏ. సిరి ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, శుభ్రత సేవల పర్యవేక్షణపై కలెక్టర్ ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.