గ్రామంలో గూఢాచారి పావురం అంటూ ప్రచారం

NZB: బోధన్ మండలంలోని భవాని పేట గ్రామంలో గూఢాచారి పావురం అంటూ ప్రచారం నడుస్తుంది. మండలంలో మైనర్ బాలుడికి అనుమానస్ఫదంగా ఓ పావురం కనిపించింది. ఆ పావురం కాలికి కోడ్ రింగ్, రెక్కలపై కోడ్ లెటర్స్ ఉండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పావురాన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.