'ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి'
KMM: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పక్రియ ముగిసే వరకు పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం అన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చింతకాని, బోనకల్ మండలాల ఎన్నికల సందర్భంగా పోలీస్ బందోబస్తు సిబ్బంది విధివిధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.