VIDEO: వాహనాలు ఢి.. తప్పిన పెను ప్రమాదం
W.G: నూజివీడు పట్టణంలోని మైలవరం రోడ్డులో వంట గ్యాస్ సిలిండర్లతో మైలవరం వైపు నుంచి వస్తున్న లారీ, ఎదురుగా మొక్కలతో వెళుతున్న వ్యాన్ శనివారం ఉదయం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఏ ఒక్కరికి గాయాలు కాకపోవడం, ఎలాంటి పెద్ద ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.