VIDEO: ఏన్కూరు-కొత్తగూడెం రహదారి గుంతలమయం

VIDEO: ఏన్కూరు-కొత్తగూడెం రహదారి గుంతలమయం

KMM: ఏన్కూరు కేంద్రం నుంచి కొత్తగూడెం వెళ్లే రహదారిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భగవాన తండా సమీపంలో రోడ్డు గుంతలమయంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. స్థానిక MLA రాందాస్ నాయక్ స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.