బడ్జెట్ కేటాయింపులపై జిల్లా ప్రజల ఆగ్రహం
NLG: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర పథకాలకు సైతం అరకొర నిధులే కేటాయించడంతో విపక్షాలు, ప్రజా సంఘాల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.