మట్టి విగ్రహాలను పూజించాలి: ఎమ్మెల్యే పరిటాల

ATP: వినాయక చవితి పండగకు మట్టి విగ్రహాలను పూజించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. మట్టి గణపయ్యలను పూజించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని కోరారు. రంగురంగుల విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలని సూచించారు.