'దేశరక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి'
ATP: దేశ రక్షణలో సైనికులు, మాజీ సైనికుల త్యాగాల వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో సాయుధ దళాల పతాక నిధికి తన వంతు విరాళాన్ని హుండీలో వేశారు. సాయుధ దళాల పథక దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అమరులైన సైనిక కుటుంబాలకు భూ పంపిణీ కోసం చర్యలు చేపట్టామన్నారు.