బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

ATP: పెద్దవడుగూరు మండలంలోని వీరన్నపల్లి గ్రామం వద్ద జరుగుతున్న పుల్లేటి వంతెన నిర్మాణ పనులను కలెక్టర్ ఓ. ఆనంద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీఎంజీఎస్‌వై ఫేజ్-3 కింద చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పురోగతిని, ఖర్చు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత, వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.