మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు మంత్రి ఆమోదం
MBNR: బాలానగర్ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు మంత్రి తుమ్మల ఆమోదం తెలిపారు. మండలంలోని మొదంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హజరు కాగా, రైతులు మొక్కజొన్న అమ్మకాల్లో ఇబ్బందులను దృష్టికి తీసుకు వచ్చారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రైతులతో పాటు తాను కూడా మొక్కజొన్న రైతుల కష్టాలను మంత్రికి వివరించారు.