VIDEO: పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఆరుగురు కేసు నమోదు
MULG: ములుగు మండలం పత్తిపల్లిలో మంగళవారం రాత్రి పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ రావు తెలిపారు. పేకాట చట్టవిరుద్ధమని, జూదం కుటుంబాలను దెబ్బతీస్తుందని పోలీసులు హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.