కొండచరియలు విరిగిపడి 50 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 50 మంది మృతి

దక్షిణ ఇథియోపియాలో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ వర్షాల కారణంగా గమోజోన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 50 మంది మృతి చెందారు. మరో 125 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి వెళ్లి బురదలో చిక్కుకున్న ఓ వ్యక్తి కాపాడారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అలాగే మృతదేహాలను వెలికి తీస్తున్నారు.