చెరకు గానుగ 28న ముగింపు
VZM: రేగిడి మండలం సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో 2025-26 సీజన్‌కు సంబంధించి చెరకు గానుగను ఈనెల 28న ముగించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. రైతులు తమ వద్ద ఉన్న చెరకును గడువులోగా కర్మాగారానికి తరలించాలని కోరింది. అవసరమైన కటింగ్ అనుమతులు, రవాణా, కూలీల సమస్యలు ఉంటే సిబ్బందిని సంప్రదించాలని చెప్పుకొచ్చింది.