VIDEO: రాజ్యాంగ విలువలు రక్షించబడాలి: మాజీ మంత్రి
SKLM: భారత రాజ్యాంగ విలువలు రక్షింపబడాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. ఇవాళ నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అది రక్షింపబడాలని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.