ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

అన్నమయ్య: పీలేరులో ఇవాళ ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారని మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గురువారం తెలిపారు. ఉదయం సచివాలయం-1లో ప్రజలకు అందుబాటులో ఉంటారని, మధ్యాహ్నం సచివాలయం-2లో, సాయంత్రం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని కోరారు.