అవమానభారంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

అవమానభారంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

JGN: స్టేషన్ ఘనపూర్ మండలం వడ్డెగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కూలీగా పనిచేస్తున్న ఆలకుంట్ల కనకరాజు (26) అవమానభారం తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. కులం చిట్టి వివాదం, బైక్ తాళం విషయమై దుర్భాషలాడిన శివరాత్రి నరేష్ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని భార్య మౌనిక ఆరోపించిది.