VIDEO: మున్సిపల్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని వడ్డే పాలెంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆహారం పెడుతున్నారా? లేదా? అని ఆరా తీశారు. అంగన్వాడి కేంద్రంలో విద్యార్థుల హాజర శాతాన్ని పెంచాలని అంగన్వాడీ టీచర్‌కు మున్సిపల్ ఛైర్మన్ సూచించారు.