'నామినేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలి'

'నామినేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలి'

VKB: ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు యాష్మిన్ బాషా తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండలం సిద్దులూరులో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అలజడి వాతావరణం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.