తాడిపత్రిలో శ్రీ సుంకలమ్మతల్లికి ప్రత్యేక అలంకరణ

తాడిపత్రిలో శ్రీ సుంకలమ్మతల్లికి ప్రత్యేక అలంకరణ

ATP: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తాడిపత్రిలోని శ్రీ సుంకలమ్మతల్లి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజలు నిర్వహించి అమ్మవారిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు.