మదనపల్లె ట్రాఫిక్ నూతన సీఐగా గురునాథ్

అన్నమయ్య: మదనపల్లె ట్రాఫిక్ సీఐగా గురునాథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన మోహన్ కుమార్ రాయచోటికి బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సీఐ గురునాథ్ మాట్లాడుతూ.. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించి, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు వాహన చోదకులు విధిగా పాటించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా సహకరించాలని కోరారు.