పంజాబ్‌లోకి విధ్వంసకర ప్లేయర్

IPL 2025 సీజన్ నుంచి పంజాబ్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, అతడి స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ తీసుకుంది. కాగా, మిచెల్ ఓవెన్ 2024-25 సీజన్‌లో బిగ్‌బాష్ లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 200 స్ట్రైక్‌రేట్‌తో 452 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు.