పోలీస్ అమరవీరుల దినోత్సవం ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ
SKLM: పోలీస్ అమరవీరుల దినోత్సవం, రాష్ట్రీయ వ్యక్త దివాస్ కార్యక్రమం సందర్భంగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయం నుంచి సెవెన్ రోడ్ జంక్షన్ వరకు భారీ ఎత్తున జరిగిన ర్యాలీలో మృతి చెందిన పోలీసులకు నివాళులు అర్పించారు.