VIDEO: పాఠశాల దుస్థితి.. వంటగదిలోనే చదువులు

VIDEO: పాఠశాల దుస్థితి.. వంటగదిలోనే చదువులు

ASR: పెదబయలు మండలం జమదాల ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాడు-నేడు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు పనులు ఆపేయడంతో, గత్యంతరం లేక ఆదివాసీ విద్యార్థులు ఇరుకైన వంట షెడ్డులోనే చదువుకుంటున్నారు. ప్రజాధనం వృధా అవుతోందని, వెంటనే పనులు పూర్తిచేసి తమ పిల్లలకు కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.