VIDEO: ఘనంగా గోపాల కృష్ణస్వామి తిరుకళ్యాణోత్సవం

NLR: రాపూరు మండలంలోని మద్దెలమడుగు గ్రామంలో ఇవాళ శ్రీ కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని శ్రీ రాధాకృష్ణ సమేత గోపాల కృష్ణస్వామి తిరుకళ్యాణోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఈ కళ్యాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.