కార్యకర్త మృతికి మంత్రి నివాళి

కార్యకర్త మృతికి మంత్రి నివాళి

కోనసీమ: టీడీపీ సీనియర్ నాయకులు గ్రంధి వెంకటరాజు అకాల మరణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం అమరావతి నుంచి రామచంద్రపురం చేరుకున్న మంత్రి నేరుగా గ్రంధి వెంకటరాజు ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహంపై పార్టీ కండువాను కప్పి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.