ప్రభావతి మృతి బాధాకరం: ఎమ్మెల్యే
NLG: దేవరకొండ పట్టణానికి చెందిన AMC డైరెక్టర్ పగిడిమర్రి రఘురాములు మాతృమూర్తి ప్రభావతి మృతి బాధాకరం అని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఇవాళ వారి స్వగృహానికి వచ్చి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.