రేపు మాంసం దుకాణాలకు సెలవు
VSP: నగరంలో మాంసం, చేపలు విక్రయాలకు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో మాంసం విక్రయాలు చేపట్టవద్దని, దుకాణాలు తెరవవద్దని, నిబంధనలు ఉల్లంఘింస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అధికారులు వ్యాపారులకు ముందుగానే తెలిపి పర్యవేక్షణ చేయాలని సూచించారు.