పట్టణంలో ప్రారంభమైన రోడ్ల విస్తరణ పనులు
ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఇరుకు రోడ్ల సమస్యపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం కమిషనర్ బట్టు తిరుపతి ఆధ్వర్యంలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించారు. ఆక్రమణలు తొలగిస్తూ ప్రజలకు, ప్రయాణికులకు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. కొందరు దుకాణదారులు, ఇంటి యజమానులకు ఇబ్బందులు ఉన్నా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సహకరించాలని కోరారు.