కంబాల శివలీలకు 'కళామతల్లి' పురస్కారం
NLG: కనగల్ మండలానికి చెందిన కంబాల శివలీలకు 'కళామతల్లి ముద్దు బిడ్డ' ఆత్మీయ సత్కారం వరించింది. గత కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న సామాజిక సేవలు, కళా రంగంలో కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నేడు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగే కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.