VIDEO: హిందూపురంలో దాడిని నిరసిస్తూ బైక్ ర్యాలీ
సత్యసాయి: హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూపురం వైసీపీ కార్యాలయం నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బైక్‌లపై ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జై జగన్ జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు పలికారు.